రెబల్ స్టార్ ప్ర‌భాస్ ఆదిపురుష్ మోష‌న్ క్యాప్చరింగ్ ప్ర‌క్రియ‌ ప్రారంభం

Date:20/01/2021

హైదరాబాద్‌ ముచ్చట్లు:

రెబల్ స్టార్ ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో తెరకెక్కుతున్నచిత్రం ఆదిపురుష్‌. ఈ చిత్రం ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ మ‌రియు తెలుగు ప్రేక్ష‌కులు భారీ అంచ‌నాల‌తో ఆదిపురుష్ అప్‌డేట్స్ ని ఫాలో అవ్వ‌టం ఈ ప్రోజెక్ట్ పై వున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది.  భార‌త‌దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెర‌కెక్కుతున్న‌ ఆదిపురుష్ మోషన్ క్యాప్చర్ షూటింగ్ మొదలైంది.   ఈ సందర్భంగా భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. టి సిరీస్ లో కొత్త ఐడియాలు, కొత్త కాన్సెప్ట్ లు ఎప్పుడూ మేము ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. ఫిలిం మేకింగ్ లో సరికొత్త టెక్నాలజీని వాడుకుంటూనే ఉన్నాం. ఓం ఆయన టీం కలిసి ఆదిపురుష్ లాంటి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. దానికోసం ఇంటర్నేషనల్ సినిమాలో వాడే లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుంటున్నారు. తొలిసారి ఇండియాలో అంత భారీ టెక్నాలజీని ఉపయోగించుకోబోతున్నాం. బాహుబ‌లి స్టార్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ఈ  అద్భుతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం.. అని తెలిపారు.
నిర్మాత ప్రసాద్ సుతార్ మాట్లాడుతూ.. సాధారణంగా ఇంటర్నేషనల్ సినిమాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విజువల్ ఎఫెక్ట్స్ వాడుతుంటారు. ఫిలిం మేకర్స్ కు వాళ్ళ కథ చెప్పడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆదిపురుష్ లాంటి ఒక అద్భుతమైన ప్రపంచం సృష్టించడానికి మేము కూడా ఇదే చేయబోతున్నాం. ఈ సినిమా మా అందరికీ ఒక ఒక మైలురాయి లాంటిది. భూషణ్ జీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా వేచి చూస్తున్నాము.. అని తెలిపారు.

 

 

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న , ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి సిరీస్ బానర్ పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ స‌హ నిర్మాత‌లు. ఫిబ్రవరి 2, 2021నాడు ఆదిపురుష్ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభం అవ్వ‌నుంది. దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) మాట్లాడుతూ, “గతంలో బెజవాడ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ చిత్రాలకు భిన్నంగా బెజవాడలో చలసాని, వంగవీటి రాధా, దేవినేని నెహ్రూ, వంగవీటి రంగాల జీవితాలలో జరిగిన వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఇంతవరకు ఎవరు చూపించనిరీతిలో నిజాలను నిర్భయంగా ఇందులో చూపించాం. ఎందరు మెచ్చుకుంటారు, ఎంతమంది నొచ్చుకుంటారు అన్న అంశంతో పనిలేకుండా వాస్తవాలను      ఆవిష్కరించాం. దేవినేని నెహ్రూ పాత్రలో  నందమూరి తారకరత్న పరకాయ  ప్రవేశం చేశారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా అలరిస్తారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం” అని అన్నారు.

ముద్రగడకు రాజ్యసభ ఆఫర్

Tags: Rebel star Prabhas Adipurush launches motion capturing process

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *