ఖమ్మం జిల్లా నుంచే టీఆర్ఎస్‌పై తిరుగుబాటు ప్రారంభం: రేణుకాచౌదరి

ఖమ్మం  ముచ్చట్లు:
టీ-పీసీసీ టీమ్‌లో సమర్థులు ఉన్నారని, ఖమ్మం జిల్లా నుంచే టీఆర్ఎస్‌పై తిరుగుబాటు ప్రారంభమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొవిడ్‌ నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కుటుంబ బాధ్యతలు తెలిసిన ప్రధాని అయితే.. ధరలు పెరిగితే కుటుంబాల ఇబ్బంది తెలిసేదన్నారు.చైనా కవ్విస్తున్నా ప్రధాని నరేంద్రమోదీ నోరు ఎందుకు మెదపడం లేదని రేణుకాచౌదరి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై దండయాత్ర ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని ఆమె మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఇతర పార్టీలకు వెళ్లిపోయిన కాంగ్రెస్ నేతలు తిరిగి వస్తారని రేణుకాచౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Rebellion against TRS begins in Khammam district: Renuka Chowdhury

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *