రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి వైఎస్సార్‌సీపీని గెలిపించండి

Recall the two votes fan and win YSRCP

Recall the two votes fan and win YSRCP

Date:17/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని దోబీకాలనీ, మంగళం కాలనీలలో వార్డు కౌన్సిలర్‌ శోభారాణి, రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, పారిశ్రామిక వేత్త ఆర్‌విటి బాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌గుర్తుకు వేసి, అసెంబ్లి అభ్యర్థిగా డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, పార్లమెంట్‌ అభ్యర్థిగా మిధున్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే ఎంబిటి రోడ్డులో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్‌ అమ్ము, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మండలంలోని మాగాండ్లపల్లె గ్రామంలో వైస్‌ ఎంపీపీ రామచంద్రారెడ్డి, నాగభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. తెలుగుదేశం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అజ్ముతుల్లా , ఇంతియాజ్‌ ఖాన్‌, రియాజ్‌, తుంగా క్రిష్ణమూర్తి, అమర, అస్లాం, రాజేష్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

జగన్‌కు ఓటేయాలన్న చిన్నారులు

 

Tags: Recall the two votes fan and win YSRCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *