నేటి నుంచి పొలాసలో లలితాసహస్ర నామ పారాయణం

జగిత్యాల ముచ్చట్లు:

 

జగిత్యాల రూరల్ మండలం పొలాసలోనీ
శ్రీలలితా మాత సేవ ట్రస్ట్-జగిత్యాల ఆధ్వర్యములో 108 శ్రీచక్ర సహిత లలితామాత దేవాలయ నిర్మాణ ప్రాంగణములో నేటినుంచి  108 రోజులపాటు సామూహిక లలితసహస్ర నామ పారాయణం జరుగుతుందని  పౌండరీ ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య తెలిపారు.
గురువారం స్వరూప జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ ఆషాడ,శ్రావణ,భాద్రపద, ఆశ్వయుజ మాసములలో అనగా ఈనెల 9 నుండి అక్టోబర్  25  వరకు 108 రోజులపాటు ప్రతిరోజు ఉదయం 10.30 నుండి 11.30 వరకు సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణము ఆలయ నిర్మాణ ప్రాంగణంలో చేయుటకు నిశ్చయించామని, ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనాలని స్వరూప కోరారు.
పారాయణములో పాల్గొన్న మహిళలకు ప్రతి శుక్రవారం గోరింటాకుతో అరచేతులను అలంకరింపజెస్తామని వివరించారు.
అలాగే  పారాయణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు గౌరవ ట్రస్టీ సభ్యులచే అమ్మవారి మెమెంటో అందజేయడం జరుగుతుందన్నారు.చివరి రోజున 108 రోజులు పారాయణములో పాల్గొన్న వారి పేరున “ఏక కుండాత్మక చండీ హోమము” జరుపబడుననీ స్వరూప స్పష్టం చేశారు.
ఇట్టి నిత్య లలితాసహస్ర నామ పారాయణంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ స్వరూప భక్తులను కోరారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Recitation of Lalitasahasra Nama in Polasa from today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *