సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రా నికి గుర్తింపు – ఎంపీ రెడ్డెప్ప
పుంగనూరు ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రిక సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రా నికి గుర్తింపు లభించిందని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కొనియాడారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో రాగానిపల్లె రోడ్డు, శాంతినగర్ ప్రాంతాలలో నిర్వహించారు. ఎంపీ , రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్ తో కలసి ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ బావుట పుస్తకాలను పంపిణీ చేశారు. ఎంపీ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా సమస్యలు ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించడం జరుగుతోందన్నారు. అలాగే నవరత్నాలను అర్హులైన పేదలందరికి అందించి , వారి అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తోడ్పాటునిచ్చిందని తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను పంపిణీ చేసి, ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అండగా నిలిచి, జగన్‌మోహన్‌రెడ్డి చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండేలా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్.లలిత, కౌన్సిలర్లు త్యాగరాజు, అమ్ము, కిజర్‌ఖాన్, నరసింహులు, మమత, జేపి.యాదవ్, రేష్మా, సాజిదా, భారతి, కాళిదాసు తో పాటు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరిఫ్, సోషియల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్‌కుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: Recognition of state through secretariat system – MP Reddappa
