Natyam ad

మాతృబాష కమ్మదనాన్ని గుర్తించండి

పుంగనూరు ముచ్చట్లు:

మాతృబాషలో ఉన్న కమ్మదనాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు మాతృబాషను అలవర్చుకోవాలని వైఎస్సార్‌ ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక గ్రంధాలయాధికారి తులసినాయక్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృబాష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటపతి, రెడ్డెప్పరెడ్డి అతిధులుగా హాజరైయ్యారు. జయరామిరెడ్డి మాట్లాడుతూ మాతృబాషతో కలిగే ఉపయోగాలు వివరించారు. ప్రతి ఒక్కరు మాతృబాషను అలవర్చుకుని మమ్మి…డాడి విధానానికి స్వస్తి పలకాలన్నారు. అలాగే శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంర్జాతీయ మాతృబాష దినోత్సవాన్ని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాతృబాష విశిష్టతను గురించి వివరించారు. ఈ సమావేశంలో ఉర్ధూగ్రంధాలయాధికారి నసీబ్‌జాన్‌, సిబ్బంది సలీము, పద్మావతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Recognize mother tongue difficulty

Post Midle