Natyam ad

అభ్యర్థత్వంపై పునః పరిశీలన చేయండి

-ఎస్ సి వి నాయుడు డిమాండ్

 

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

 

శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థత్వం పై మరోసారి పునః పరిశీలన చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ను కోరారు.
తన సీనియార్టీ వయసు ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పరిగణలోకి తీసుకొని పున పరిశీలన చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ముని రామయ్య తో పాటు తమ అనుచర వర్గానికి న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన హామీ లభించాలని, ప్రస్తుతం జరుగుతున్న అరాచక దోపిడీ పాలనలు భవిష్యత్తులో రాకూడదనిదే తమ తమ అభిమతమని ఎస్ సి వి నాయుడు అన్నారు.శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు తన స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే ముని రామయ్య, దేశం నాయకులు గురుదశరథన్ , నారాయణ యాదవ్, చీకటి వేణు, భాస్కర్ నాయుడు, సత్ర వాడ ప్రవీణ్ కుమార్ తదితర నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి పై మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి పునః పరిశీలన చేయాలని అభ్యర్థించారు. తన వయసు సీనియార్టీ ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి, ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అభ్యర్థత్వంపై మరోసారి పునః పరిశీలన చేసి తనకు టిడిపి అభ్యర్థిగా అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.

 

 

 

Post Midle

తనను ప్రస్తుత అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి కలిసినప్పుడు కూడా తాను స్పష్టంగా చెప్పానని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి తనకు తన వర్గానికి న్యాయం చేసేలా హామీ పొందాల్సి ఉంది అని స్పష్టం చేశామని తెలిపారు. పార్టీ నిర్ణయం అందరికీ శిరోధార్యం అని అయితే తాను మరోసారి శ్రీకాళహస్తి అభ్యర్థి తత్వం పై చంద్రబాబునాయుడు పున పరిశీలన చేసి మరోసారి సర్వే చేసి అభ్యర్థిని ఖరారు చేయాలని కోరుతున్నామన్నారు. శ్రీకాళహస్తి సత్యవేడు, తిరుపతి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ప్రకటనపై పార్టీ నాయకులు కార్యకర్తలు లో తీవ్ర అసంతృప్తి నెలకుందని, స్థానిక పరిస్థితులు గందరగోళం గా మారాయిని వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని టిడిపి అధినేత పార్టీలో గెలుపు అవకాశాలు ఎక్కువగా వారికి టికెట్లు ఇచ్చే విధంగా పున పరిశీలన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తనకు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే 38 వేల ఇల్లు, 40 వేల ఇంటి పట్టాలు పంపిణీ చేశామని, సుమారు 2 వేలు లు పైగా గుళ్ళు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించామని, ప్రజలకు నిరంతరం సేవ చేసి నాలుగు నియోజకవర్గాల్లో ప్రజల ఆధార అభిమానం సంపాదించుకున్నామన్నారు.

 

 

వైసీపీ పాలనలో అరాచక దోపిడీ దౌర్జన్యాలతో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని, గుళ్ళు, గోపురాలు సర్వనాశనమై దేవుడే ఉండలేని పరిస్థితులు తీసుకొచ్చారని, భవిష్యత్తులను ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రజలకు, పార్టీ నాయకులకు భరోసా కల్పిస్తూ ప్రజల ఆదరభిమానాలు మెండు గా ఉన్న నాయకులకు టికెట్లు ఇచ్చి పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అధిష్టానం గుర్తించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ సి వి నాయుడు కోరారు.

 

Tags: Reconsider the application

Post Midle