చిట్టి  సరికొత్త రికార్డ్స్ నమోదు 

Record the newest records

Record the newest records

Date:14/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
యూట్యూబ్‌లో చిట్టి విధ్వంసం మామూలుగా లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబోలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.o’ మూవీ టీజర్ వినాయక చవితి కానుకగా విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సెప్టెంబ‌ర్ 13 ఉద‌యం 9 గంట‌ల‌కు విడుద‌లైన ‘2.o’ టీజ‌ర్ కేవలం గంట వ్యవధిలోనే 30 లక్షలకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్స్ నమోదు చేసింది.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలైన ఈ టీజర్ మూడు భాషల్లోనూ యూట్యూబ్‌ని షేక్ చేసింది. తొలి 12 గంటలకు గాను తమిళ్‌లో.. 8.2 మిలియన్ వ్యూస్, హిందీలో 8.1 మిలియన్ వ్యూస్, తెలుగులో 4.6 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక 24 గంటలకు గానూ.. తమిళ్‌లో 9.4 మిలియన్ వ్యూస్, హిందీలో 10.3 మిలియన్ వ్యూస్, తెలుగులో 5.1 మిలియన్ వ్యూస్ సాధించినట్టుగా లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్‌లో అఫీషియల్‌గా ప్రకటించింది.
ఈ లెక్కల్ని బట్టి సౌత్ ఇండియాలో కాకుండా ఇండియన్ సినిమాలో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా ‘2.o’ మూవీ జెండా పాతేసింది. ఈ మిలియన్ల వ్యూస్ ప్రవాహం కొనసాగుతుండగా ఈ టీజర్‌పై విమర్శలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. మొదట్లో రూ. 200 కోట్లు, ఆ తరువాత రూ. 300 కోట్లు.. 400 కోట్లు.. 500 కోట్లు.. ‘2.o’ మూవీ బడ్జెట్ ఇంతటితో ఆగలేదు. టీజర్ విడుదల నాటికి రూ. 543 కోట్ల బడ్జెట్ అంటూ బాంబ్ పేల్చారు అక్షయ్ కుమార్.
ఇండియన్ సినిమా హిస్టరీలో తొలిసారిగా 75 మిలియన్ డాలర్స్‌తో తెరకెక్కించిన వీఎఫ్‌ఎక్స్ విజువల్ వండర్ ‘2.o’ అంటూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. హాలీవుడ్ సినిమాలకు సైతం ఇంత బడ్జెట్ పెట్టాలంటే నిర్మాతలకు ఎంత ధైర్యం ఉండాలి. శంకర్ మీద ఉన్న నమ్మకం, రజినీ కాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, అక్షయ్ కుమార్ స్టామినా వీటన్నింటిముందు ‘2.o’ చిత్రానికి ఎంత పెట్టినా తక్కువే అనుకున్నారో ఏమో కాని.. శంకర్ అడిగిందే తడువుగా రూ. 543 కోట్ల భారీ బడ్జెట్ పెట్టేశారు.
ఇక పలు వాయిదాల అనంతరం విడుదలైన ఈ టీజర్‌పై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఇంత హంగు, ఆర్భాటాలతో తెరకెక్కించిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం రీచ్ కాలేదంటూ పెదవి విరుపులు ఎక్కువ అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ‘2.o’ టీజర్‌పై విమర్శలు గుప్పిస్తూ.. చిట్టీతో ఆటాడేస్తున్నారు ట్రోలర్స్. ఫన్నీ ఫన్నీ మీమ్స్‌తో ‘2.o’ టీజర్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Tags:Record the newest records

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *