450 సెల్ ఫోన్ల రికవరీ

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ పోలీసులు సెల్ ఫోన్ల రికవరీలో సక్సెస్ అయారు. సెల్ ఫోన్ల బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి 450 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. వీటి విలువ 80 లక్షలు ఉంటుందని  డీసీపీ -1 కె .శ్రీనివాసరావు తెలిపారు. చాట్ బోట్ వెబ్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు, బాధితులకు రికవరీ చేసిన ఫోన్లు అందించినట్లు తెలిపారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్నవారు వాట్స్ యాప్ ద్వారా మాకు పిర్యాదు చేస్తే రికవరీ చేస్తామని, చాట్ బోట్ వెబ్ పోర్టల్ ద్వారా పోగొట్టు కున్న ఫోన్లను రికవరీ చేస్తున్నామని వివరించారు. 450 ఫోన్లను వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలలో రికవరీ చేశామని, సెల్ ఫోన్లు రికవరీ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలో స్కూల్ పిల్లలు ఆటో ప్రమాదం తరువాత ప్రత్యేక దృష్టి పెట్టామని,పరిమితికి మించి పిల్లల ను ఆటో లో ఎక్కిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags: Recovery of 450 cell phones

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *