చెత్తను ఎరువుగా మార్చి ఆదాయాన్ని వృద్ధి చేసుకోవాలి

Recycling of waste is to grow revenue

Recycling of waste is to grow revenue

– అరుణాశేఖర్‌

Date:15/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలో స్వచ్చ సర్వేక్షణ్‌లో బాగంగా కంపోస్ట్యార్డులో చెత్తను ఎరువుగా తయారు చేసి, ఆదాయాన్ని సమకూర్చుకోవాలని హైదరాబాద్‌కు చెందిన కంపోస్ట్యార్డ్ నిపుణులు అరుణాశేఖర్‌ పిలుపునిచ్చారు. గురువారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ , మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర ఆధ్వర్యంలో స్వచ్చసర్వేక్షణ్‌ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంపోస్ట్ నిపుణులు అరుణాశేఖర్‌ అతిధిగా హాజరై, డస్ట్బిన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటిలో తడిచెత్త, పొడి చెత్తను వేరుచేసి, కంపోస్ట్యార్డుకు తరలించడం మంచికార్యక్రమం అన్నారు. చిన్న మున్సిపాలిటిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, పలువురికి ఆదర్శంగా నిలిచారన్నారు. చెత్త ద్వారా ఎరువులు తయారు చేసి, దానిని అతి తక్కువ ధరకు రైతులకు విక్రయించడంతో మున్సిపాలిటి ఆదాయం పెరుగుతుందన్నారు. ముఖ్యంగా స్వచ్చసర్వేక్షణ్‌ కార్యక్రమాలను మూడునెలల పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మున్సిపాలిటిని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, ఆర్‌వో రంగనాథ్‌, టీపీవో క్రిష్ణారావు, కౌన్సిలర్లు దివ్యలక్ష్మి, మనోహర్‌, ప్రకాష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌తో పాటు మహిళలు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

గ్రంధాలయ వారోత్సవాలు

Tags; Recycling of waste is to grow revenue

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *