యదేఛ్చగా రీ సైక్లింగ్

Recycling

Recycling

Date:11/08/2018
పాలమూరు ముచ్చట్లు:
సబ్సిడి గొర్రెలు అక్రమాలకు కేంద్రబిందువుగా మారింది. అధికారుల అండతో రీ సైక్లింగ్‍ యథేచ్చగా సాగుతుంది. ధళారులకు నేతల అండ పుష్క్జలంగా వుండటంతో సబ్సిడి గొర్రెల అవినీతికి అడ్డుఅధుపు లేకుండా పోయింది. కులవృత్తులను అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సబ్సిడి గొర్రెలు అక్రమార్కులకు వరంగా మారింది…కళ్లెడుటే అక్రమాలు జరుగుతున్న అధికార యంత్రంగం చూసిచూడన్నట్లు ప్రవర్తిస్తుంది.ముఖ్యమంత్రి కేసిఆర్‍ ప్రవేశపెట్టిన సబ్సిడి గొర్రెల పథకం ఉమ్మడి మహబూబ్‍ నగర్‍ జిల్లాలో అవినీతి అక్రమాలకు నిలయంగా మారాయి. టిఆర్‍ఎస్‍ ఎమ్మేల్యే ప్రాధ్యనిత్యం వహిస్తున్న మహబూబ్‍ నగర్‍ నియోజకవర్గంలోని రామచంద్రపూరం, జమిస్తాపూర్‍, కోటకదిర గ్రామాలలో నివసించే గొల్ల, కురమ కులస్తులకు ప్రభుత్వం గొర్రెలను పంపిణి చేసింది.  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి దఫా పంపిణి చేసిన గొర్రెలలో బారిస్థాయిలో అవినీతి చోటుచేసుకున్నాయని ఆరోపణాలు వున్నాయి. కడప ప్రాంతానికి చెందిన ధళారులతో ఇక్కడి ధళారులు కలిసి రీ సైక్లింగ్‍ దందాకు తెరలేపారని చెప్పవచ్చు. నిబంధన్నల ప్రకారం పథకం కింద ఒకసారి కొనుగోలు చేసిన గొర్రెలకు జియో ట్యాగింగ్‍ వేయడం ద్వార వాటిని ఇతరులు కొనకూడదు, విక్రయించకూడదు. ట్యాగ్‍ వే సిన గొర్రెలను దర్జాగా మహబూబ్‍ నగర్‍ జిల్లాలో విక్రయిస్తున్నారు. అదే విధంగా ఒకరొగొర్రెకు రెండు మూడు రంద్రాలు వుండటంతో వాటిని రీ సైక్లింగ్‍ గొర్రెలుగా నిర్దారించవచ్చు. మనం చూస్తున్న ఈ గొర్రెలు జమిస్తాపూర్‍ గ్రామానికి చెందిన బాలయ్య యాదవ్‍ కు చెందిన ఇరవై గొర్రెలు వున్నాయి. ఈ గొర్రెలన్ని రీ సైక్లింగ్‍ చేసిన గొర్రెలే, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ దందా కొనసాగుతునే వుంది. మహబూబ్‍ నగర్‍ జిల్లా వ్యాప్తంగా 70 యూనిట్లను గుర్తించి కేసులు కూడ నమోదు చేయడం జరిగింది. జిల్లాలో పంపిణి చేసిన గొర్రెల్లో పెద్ద సంఖ్యలో అవినీతి చోటు చేసుకుందని కోటి రూపాయాలకు పైగా ప్రజాధనం ధళారుల పాలైందని ఆరోపణాలు నెలకొన్నాయి. జిల్లాలో 54 వేల 5 వందల 94 మంది లబ్దిదారులను ఎంపిక చేయగా ఇప్పటి వరకు 18 వేల 3 వందల 72 మందికి యూనిట్ల పంపిణి చేశారు. రీ సైక్లింగ్‍ వ్యవహరం జిల్లాలో రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. క్ష్రేత్రస్థాయిలో అధికారులు కొందరు, ధళరులు, నాయకులు కుమ్మక్కవడంతో సబ్సిడి గొర్రెలు ధళారులకు కాసుల పంటగా మారింది.ఇప్పటికైన అధికారులు విజిలెన్స్ విచారణ జరుపుతే అసలు నిజలు వెలుగు చూసే అవకాశం వుంది.
Tags:Recycling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *