30,31 డివిజన్ లలోనూ రెడ్ అలర్ట్

Date::03/04/2020

నెల్లూరు ముచ్చట్లు:

స్థానిక 30,31 డివిజన్లను అధికారులు శుక్రవారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. పై డివిజన్ల పరిధిలోని గాంధీనగర్,  కొత్తూరు ప్రాంతాలలో నూతనంగా గుర్తించిన  కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కారణంగా 30, 31 డివిజన్లలో  జిల్లా అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఆ డివిజన్లలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రెడ్ అలర్ట్ ను దిక్కరించి ఎవరైనా తమ ఇళ్లలోని బయటకు వచ్చి రోడ్లలో కనిపించినట్లయితే తగిన చర్యలు కఠినంగా తీసుకుంటామని నెల్లూరు గ్రామీణ మండల తాసిల్దార్ నాజర్ హెచ్చరించారు

 ఏపీలో తొలి కరోనా మరణం

Tags:Red Alert across 30,31 divisions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *