ఎయిర్ పోర్టులో రెడ్ అలర్ట్
శంషాబాద్ ముచ్చట్లు:
గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
ఈ నెల 31 వరకు ఎయిర్ పోర్ట్ లో రెడ్ అలెర్ట్ కొనసాగుతుంది. 31 వరకు సందర్శకుల పాసుల అనుమతి ఇవ్వరు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేసారు. ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాంగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వాహనాలను అపి తనిఖీ చేస్తున్నారు.
Tags: Red alert in the airport

