Natyam ad

పెద్ద ఎత్తున పట్టుబడ్డ ఎర్రచందనం-జిల్లా ఎస్పి   పి.పరమేశ్వర రెడ్డి ఐపిఎస్.,

-5 మంది తమిళనాడు కు చెందిన అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్లు అరెస్ట్ మరియు సుమారు 4.49 కోట్ల రుపాయుల విలువగల ఎర్ర చందనం, 2 కార్లు స్వాదీనం.

➡️ సుమారు 4,31,07,200/- రూపాయల విలువ కలిగిన 5,388 Kg ల 275 ఎర్ర చందనం దుంగలు, ముక్కలు, పొడి మరియు సుమారు 18,00,000/- విలువ గల రెండు కార్లు, నగదు 3200/- రూపాయలు, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం. మొత్తం విలువ 4,49,07,200/- రూపాయలు.

➡️ NH-16 జాతీయ రహదారిపై పెద్ద పన్నంగాడు ఆంధ్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద సూళ్లూరుపేట సిఐ మధుబాబు, తడ ఎస్ఐ శ్రీనివాస రెడ్డి, సూళ్లూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు మరియు తడ, సూళ్ళురుపేట పొలీస్ స్టేషన్ ల సిబ్బంది మాటువేసి స్మగ్లర్లను అరెస్టు చేశారు.

Post Midle

➡️ పట్టుబడిన ముద్దయిలందరూ తమిళనాడు వాసులే.

➡️ A1.మురుగన్ ఇదివరకే PD-ACT క్రింద జైలు శిక్షను అనుభవించి, జూన్ నెలలో విడుదల అయ్యాడు..అయినప్పటికీ మళ్ళి ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతుండగా అరెస్ట్.

➡️ అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటుతో పటిష్టమైన చర్యలు..ఫలితంగా నేడు అక్రమ రవాణాకు అడ్డుకట్ట.

➡️ అక్రమ రవాణాకు పాల్పడిన, సహకరించిన వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.

➡️ ముద్దాయిలపై పిడి యాక్ట్ ప్రయోగం.

 

 

తిరుపతి  ముచ్చట్లు:

 

కేసు వివరాలు-

జిల్లా ఎస్పి   పి.పరమేశ్వర రెడ్డి ఐపిఎస్.,  సోమవారం నాడు తిరుపతి పోలీసు పెరేడ్ మైదానం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పి  మాట్లాడుతూ నాయుడుపేట SDPO రాజగోపాల్ రెడ్డి  పర్యవేక్షణలో సబ్ డివిజన్ సిబ్బంది తిరుపతి జిల్లా, నాయుడుపేట సబ్ డివిజన్, సూళ్ళురుపేట సర్కిల్, తడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్నటి దినం 06.11.2023 వ తేదీన ఉదయం సుమారు 08:00 గంటల సమయంలో NH-16 రహదారిపై పెద్ద పన్నంగాడు ఆంధ్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా తిరుపతి నుండి తమిళనాడు వైపుకి అతి వేగంగా రావడాన్ని గమనించిన సిబ్బంది, అప్రమత్తమై చాకచక్యంగా ఆ వాహనాలను అదుపు చేసి తమిళనాడు కు చెందిన అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 5 మంది ఎర్ర చందనం స్మగ్లర్స్ ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 4,31,07,200/- రూపాయల విలువ కలిగిన 5,388 Kg ల 275 ఎర్ర చందనం దుంగలు, ముక్కలు, పొడి మరియు సుమారు 18,00,000/- విలువ గల రెండు కార్లు, నగదు 3200/- రూపాయలు, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 4,49,07,200/- రూపాయలు. పట్టుబడిన ముద్దయిలందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే. ఇది మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.ముద్దాయిలు తిరుపతి పరిసర ప్రాంతాల నుండి ఎర్ర చందనమును సేకరించి తమిళనాడు రాష్ట్రంలో పెద్ద స్మగ్లర్ల గోడౌన్ల లో భద్ర పరచి, తదుపరి అట్ట పెట్టెలలో ప్యాకింగ్ చేసి, దుంగలను పసుపు పొడి రవాణా ముసుగులో ఎవరికీ అనుమానం కలుగకుండా లోడ్ మధ్యలో పెట్టి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి తరిలిస్తున్నట్లు సమాచారం తెలిసిందన్నారు. ఈ ముఠా వెనకున్న పెద్ద స్మగ్లర్ల కోసం గాలింపు చేపడుతున్నాము తిరుపతి పరిసర ప్రాంతాలలో ఈ ముఠాకి సహాయ సహకారాలు అందిస్తున్న వారిని కూడా గుర్తించి అరెస్టు చేయడం చేసి ఈ స్మగ్లర్ల నెట్వర్క్ ను పూర్తిగా చేదించి ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టతామన్నారు.జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రత్యేకమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి ఉన్నాము. అవసరమైన రహదారుల యందు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి, పటిష్ట మైన చర్యలు తీసుకుంటున్నాము. నిఘా వ్యవస్థ బృందాలను ఖచ్చితమైన సమాచారం కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శేషాచలం సంపదను కాపాడుకోవడం మన విధి, అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. ఇప్పటికే ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ ద్వారా మరిన్ని దాడులు నిర్వహించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు.

 

అందులో భాగంగా అవసరమైన ప్రతిచోట నిఘా వ్యవస్థ సమాచారం మేరకు ప్రతి రోజు విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టాలని అధికారులకు సూచించడం జరిగింది. ఫలితంగా నిన్న ఎర్ర చదనం స్మగ్లర్ల ను అడ్డుకుని మన జాతీయ సంపదను కాపాడటం జరిగిందన్నారు.అదేవిధంగా ప్రజలకు ఎవరికైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు చేరవేసి, భారత జాతీయ సంపద అయిన ఎర్రచందనం కాపాడటంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచి, అవసరమైతే వారికి భద్రతను కల్పిస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు:

1. మురుగన్ @ మురుగానంద్, తండ్రి: లేట్ పాలయన్, వయస్సు:42 సం’లు, షోళవరం, చెన్నై, తమిళనాడు. (ఎర్ర చదనం రవాణాదారుడు).
2. హేమంత్ కుమార్ @ రాజ @ హరి, తండ్రి: లేట్ కుప్పుస్వామి, వయస్సు:37 సం’లు, పల్లవరం, చెన్నై, తమిళనాడు. (ఎర్ర చదనం అమ్మే మధ్యవర్తి).
3. రవి, తండ్రి: సురేష్, వయస్సు:31 సం’లు, మనివాక్కం, చెన్నై, తమిళనాడు. ( డ్రైవర్ & వర్కర్).
4. విమల్, తండ్రి: లేట్ రాజేంద్రన్, వయస్సు:32 సం’లు, షోళవరం, చెన్నై, తమిళనాడు. ( డ్రైవర్ & వర్కర్).
5. సురేందర్, తండ్రి: గుణ శేఖర్, వయస్సు:33 సం’లు, షోళవరం, చెన్నై, తమిళనాడు. ( డ్రైవర్ & వర్కర్).

పట్టుబడిన ముద్దాయిలలో ఇద్దరిపై పాత కేసులు ఉన్నాయి. A1 మురుగన్ పై 17 ఎర్రచందనం కేసులు, A2 హేమంత్ కుమార్ పై 03 ఎర్రచందనం కేసులు నమోదు అయినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. A1.మురుగన్ పై తిరుపతి రెడ్ శాండల్ టాస్క్ ఫోర్సు పోలీసులు ప్రయోగించిన PD-ACT కేసు క్రింద జైలు శిక్షను అనుభవించి, జూన్ నెలలో విడుదల అయ్యాడు. అయినప్పటికీ పరివర్తన చెడకుండా మళ్ళి ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతుండగా అరెస్ట్ చేశామన్నారు. మిగిలిన వారిపై కూడా పక్క జిల్లాలలో గానీ, ఇతర రాష్ట్రాల్లో గానీ ఏమైనా కేసులు నమోదయి ఉన్నాయా అని ఆరా తీస్తున్నాము. అయితే ఇప్పుడు ముద్దాయిలందరిపై PD-ACT ప్రయోగిస్తామన్నారు.ఈ కేసు చేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాయుడు పేట డి.యస్.పి రాజగోపాల్ రెడ్డి, సూళ్లూరుపేట సి.ఐ మధుబాబు, యస్.ఐ లు శ్రీనివాస రెడ్డి తడ, బ్రహ్మనాయుడు సూళ్లూరుపేట మరియు తడ, సూళ్ళూరుపేట పోలీసు స్టేషన్ల సిబ్బంది ఏ.యస్.ఐ రాఘవయ్య, హెచ్.సి లు శీనయ్య, సురేష్, పి.సి లు సుహేల్ బాబు, శివ కుమార్, శంకర్, వెంకటేశ్వర్లు, నాగార్జున, వెంకటేశ్వర్లు, చంద్ర శేఖర్, హోంగార్డ్ లు శ్రీను, చంద్ర శేఖర్, చంద్ర అయిన వారిని జిల్లా ఎస్పి  పి.పరమేశ్వర రెడ్డి ఐపిఎస్.,  అభినందించి ప్రశంశా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శాంతి భద్రత  కులశేఖర్, సూళ్లూరుపేట సిఐ మధుబాబు, ఎస్ఐలు శ్రీనివాసరెడ్డి తడ, బ్రహ్మనాయుడు సూళ్లూరుపేట మరియు తడ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:Red sandalwood caught on a large scale-District SP P.Parameshwara Reddy IPS.,
​665

Post Midle