అలిపిరి బైపాస్ లో రవాణాకు సిద్దంగా ఉన్న ఎర్ర చందనం పట్టివేత

Red sandalwood ready for shipment in Alipiri Bypass

-తమిళ స్మగ్లర్ అరెస్టు
– ఫేక్ నెంబర్ వాహనం స్వాధీనం

Date:21/11/2019

తిరుపతి ముచ్చట్లు:

అలిపిరి బైపాస్ రోడ్డు లోని అరవింద్ ఐ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలోని టీటీడీ ఫారెస్ట్ పరిధిలో రవాణాకు సిద్దంగా ఉన్న 23 ఎర్ర చందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. రవాణా చేయడానికి ఏర్పాటు చేసుకున్న వాహనం, అడవుల్లో ఉన్న స్మగ్లర్లు కోసం తీసుకుని వెళ్లడానికి తెచ్చిన వంట సామగ్రి ని స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర దుంగలు మోసుకుని వస్తున్న ఒక స్మగ్లర్ ను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ పి రవిశంకర్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ అల్లా బక్ష్ సూచనలతో ఆర్ ఎస్ ఐలు వాసు, విజయ్, లింగాధర్ టీమ్ లు శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేసి వస్తుండగా అరవింద్ ఐ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలో కి ఒక స్కార్పియో వాహనం వెళ్లడాన్ని గమనించారు. దీంతో అనుమానం కలిగిన టాస్క్ ఫోర్స్ టీమ్ అక్కడే మాటు వేయగా స్మగ్లర్లు ఎర్ర దుంగలను మోసుకుని వస్తూ తారసపడ్డారు. వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా, స్మగ్లర్లు దుంగలను పడవేసి పారిపోయారు. వారిలో వేలూరు జిల్లా కన్నెమంగళం జవ్వాదిమలై కు చెందిన ఏలుమలైను పట్టుకున్నారు. ఎపి 03 టీఈ 5997 అనే ఫేక్ నెంబరు కల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకటయ్య మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ టీమ్ ను అభినందించారు. అడవుల్లో మరింత మంది స్మగ్లర్లు ఉన్నారని తెలిసిందని, వారికోసం కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పట్టు బడిన ఏలుమలై 2016లో కూడా అరెస్టు అయ్యాడని, ఇతను అనేక సార్లు స్మగ్లింగ్ చేసినట్లు తెలిసిందని అన్నారు. టీమ్ లను టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారు, డీఎస్పీ అల్లా బక్ష్ లు అభినందించారు. సంఘటన స్థలానికి ఎసిఎఫ్ కృష్ణయ్య, ఎఫ్ ఆర్ ఒ ప్రసాద్ చేరుకోగా ఎస్ ఐ చంద్రశేఖర్ గౌడ్, పిసి నాగేంద్ర కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇంటికోసం పునాదులు తవ్వితే..నీళ్ళు బయటపడ్డాయి….

 

Tags:Red sandalwood ready for shipment in Alipiri Bypass

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *