ఎర్రచందనం స్మగ్లర్ల అటకట్టిస్తా..! ఎస్పీ హర్షవర్ధన్ రాజు

-తిరుపతి ఎస్పీకి అదనపు బాధ్యతలు

-ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరణ

 

తిరుపతి  ముచ్చట్లు:

తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా అదనపు బాధ్యతలు తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ స్వీకరించారు. సోమవారం తిరుపతి రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణ పోలీసు దళం) ఎస్పీగా వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ తన క్యాంపు కార్యాలయం నందు అదనపు బాధ్యతలను చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువైన అటవీ సంపదను కాపాడేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నిరంతరం సిబ్బందిని అప్రమత్తం చేస్తానని వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లర్ల అటకట్టిస్తామని స్పష్టం చేశారు. అక్రమంగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడితే ఎంతటి వారైనా సరే వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

 

Tags: Red sandalwood will stop the smugglers..!SP Harshvardhan Raju

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *