ఏడు లక్షలు విలువ చేసే ఎర్రచందనం, వాహనం స్వాధీనం
– ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్ కేసు నమోదు
అన్నమయ్య ముచ్చట్లు:

కలికిరి మండలంలోని మేడి కుర్తి,కలకడ క్రాస్ దగ్గర కలికిరి SI లోకేష్ రెడ్డి తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేపట్టారు.ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వేగంగా వస్తున్న క్రమంలో పోలీసులు అపగా ఆపకుండా పారిపోయారు.వెనకంటూ వచ్చిన మరో కారు వేగంతో వెళ్లగా వారిని వెంబడించడంతో వాహనాలు వదిలి పారిపోయే క్రమంలోముగ్గురు స్మగ్లర్ల ను అదుపులోకి తీసుకొని, ఎర్రచందనం, వాహనం స్వాధీనం చేసుకున్నట్లు SI లోకేష్ రెడ్డి తెలిపారు.ముగ్గురు తమిళనాడు కు చెందిన.స్మగ్లర్లు మనీ బాబు, కుల్లాన్ కుమార్, పొన్నుస్వామి గాగుర్తించారు.
కేసునమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Tags: Red sandalwood worth seven lakhs and vehicle seized
