పుంగనూరులో మోర్‌ సూపర్‌ మార్కెట్‌ను ప్రారంభించిన ఎంపీ రెడ్డెప్ప

 Reddeppa MP who opened More Super Market in Punganur

 Reddeppa MP who opened More Super Market in Punganur

– తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు
– మోర్‌ సూపర్‌ మార్కెట్‌కు రండి
– మోర్‌ యాజమాన్యం పిలుపు

Date:18/10/2019

పుంగనూరు ముచ్చట్లు :

పుంగనూరు మున్సిపాలిటిలో తొలిసారిగా కార్పోరేట్‌ వ్యాపార సంస్థ అయిన మోర్‌ సూపర్‌ మార్కెట్‌ను చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ప్రారంభించారు. పట్టణంలోని మదనపల్లె రోడ్డులో వివి కాంప్లెక్స్లో మోర్‌ సూపర్‌ మార్కెట్‌ను మార్కెట్‌ ఇన్‌చార్జ్ సాయినాథ్‌ ఆధ్వర్యంలో ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా కమిషనర్‌ కెఎల్‌.వర్మ,  లయన్స్ క్లబ్ జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ పి.శివ, క్లబ్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ కె.సరళ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ 65 వేల మంది జనాభా కలిగిన పుంగనూరులో మోర్‌ సూపర్‌మార్కెట్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. అన్ని రకాల నాణ్యమైన వస్తువులను మోర్‌ మార్కెట్‌ను ప్రజలకు తక్కువ ధరకు అందించడం శుభపరిణామమన్నారు. కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ సూపర్‌ మార్కెట్‌లో నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకు ప్రజలకు అందించేందుకు మోర్‌ సూపర్‌ మార్కెట్‌ పుంగనూరు పట్టణాన్ని ఎంపిక చేసుకోవడం సంతోషకరమన్నారు. ఇలాంటి వ్యాపార సంస్థలు రావడంతో పుంగనూరు పట్టణం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఇలాంటి వ్యాపార సంస్థలు మరిన్ని పుంగనూరు పట్టణంలో నెలకొల్పాలని, ఇందుకోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కర్నాటక సరిహద్దు ప్రాంతమైన పుంగనూరు ప్రజలు ఎక్కువశాతం తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు కర్నాటక ప్రాంతానికి వెళ్తారన్నారు. మోర్‌ సూపర్‌ మార్కెట్‌ ద్వారా ప్రజలకు అన్ని రకాల వస్తువులు తక్కువ ధరలకు ఇక్కడే లభిస్తుందని ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కెసిటివి అధినేత ఎన్‌.ముత్యాలు, కాంట్రాక్టర్‌ వెంకటాచలపతిరెడ్డి, జెఏసి చైర్మన్‌ వరదారెడ్డి, విశ్రాంత అధ్యాపకురాలు , భవన యజమాని విజయలక్ష్మి, విశ్రాంత ఉద్యోగి రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Reddeppa MP who opened More Super Market in Punganur
Reddeppa MP who opened More Super Market in Punganur

ఆగమ్యగోచరంగా కోడెల శివరామ్ పరిస్థితి

Tags: Reddeppa MP who opened More Super Market in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *