Reddyppa MP distributed by Minister Peddi Reddy Masks and Sanitizers

మంత్రి పెద్దిరెడ్డి మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేసిన ఎంపీ రెడ్డెప్ప

Date:01/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే , రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు 6 వేల శానిటైజర్లు, మాస్క్ లను ఎంపీ రెడ్డెప్ప పంపిణీ చేశారు. సోమవారం మండల కార్యాలయంలో ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే మండలంలోని గ్రీన్‌ అంబాజిడర్లకు దుస్తులు, చెప్పులు పంపిణీ చేశారు. వీరితో పాటు మున్సిపాలిటిలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం , కమిషనర్‌ కెఎల్‌.వర్మతో కలసి ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ప్రజలు వ్యక్తిగత పారిశుద్ధ్య కార్యక్రమాలను , ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ మంత్రి 6 వేల శానిటైజర్లను పంపించారన్నారు. ఇప్పటికే మండలంలో 1.50 లక్షల మందికి మాస్క్లు ఒకొక్కరికి మూడు చొప్పున పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే పట్టణంలో 2 లక్షల మాస్క్లు పంపిణీ చేశామన్నారు. ప్రజలు భౌతికదూరం పాటిస్తూ , కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి వ్యక్తిగత సహాయకులు మునితుకారాం , పార్టీ నేతలు రామచంద్రారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, చెంగారెడ్డి, ఖాదర్‌బాషా, రెడ్డెప్ప, ఆర్థర్‌పాల్‌, రాజేష్‌, సురేష్‌ పాల్గొన్నారు.

డ్రైవర్ నాయుడు ది ప్రభుత్వ హత్యే

Tags: Reddyppa MP distributed by Minister Peddi Reddy Masks and Sanitizers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *