Gold deposits in Kurnool

తగ్గిన బంగారం ధరలు

Date:16/10/2020

ముంబై ముచ్చట్లు:

బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ సెషన్‌లో కొంచెం తగ్గుముఖం పట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్ )లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.50,635కు తగ్గింది. వెండి కిలో ప్యూచర్స్ రూ.61,650కి పెరిగింది. గోల్డ్ ధరలు గతవారం పదిరోజులుగా హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి. ఇంతకుముందు సెషన్‌లో పసిడి 0.3 శాతం పెరిగాయి. వెండి ధరలు 0.3 శాతం క్షీణించింది. ఆగస్టు మాసంలో పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పలికింది. ఆ ధరతో ఇప్పటికీ రూ.5,500కు పైగా తక్కువ ఉంది. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ తగ్గగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర స్వల్పంగా పెరిగింది. 0.03 శాతం పెరిగి 10 గ్రాములు రూ.50,775 పలికింది. రూ.50,811 వద్ద ప్రారంభమైంది.నేటి గరిష్టం కూడా అదే. కనిష్టం రూ.50,770 పలికింది.

 

 

వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ 0.19 శాతం(రూ.115) పెరిగి రూ.61,650 పలికింది. ఈరోజు రూ.61,649 వద్ద ప్రారంభమై రూ.61,781 వద్ద గరిష్టాన్నతాకింది. రూ.61,469 వద్ద కనిష్టాన్ని తాకింది. వెండి మార్చి ఫ్యూచర్స్ 0.21 శాతం (రూ.135) పెరిగి కిలో రూ.63,382 పలికింది. రూ.63,377 వద్ద ప్రారంభమై, రూ.63,462 వద్ద గరిష్టాన్ని, రూ.63,310 వ్ద కనిష్టాన్నితాకింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు 0.05 శాతం పెరిగి ఔన్స్ ధర 1,909.85 డాలర్లు పలికింది. 1,907.95 – 1,915.15 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 1,908.90 డాలర్ల వద్ద ముగిసింది. వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ 0.79 శాతం ఎగిసి ఔన్స్ 24.415 డాలర్లు పలికింది.

 

 

వెండి 24.315 – 24.545 మధ్య ట్రేడ్ అయింది.క్రితం సెషన్‌లో 24.224 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆగస్ట్‌లో ఆల్ టైమ్ గరిష్టం 2,075 డాలర్లు పలకగా, వెండి 30 డాలర్ల మార్క్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,740 పలికింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.48,310 పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.53,730, 22 క్యారెట్ల పసిడి రూ.49,250 పలికింది.

ముంపు ప్రాంతాల్లో కేటీఆర్ టూర్

Tags: Reduced gold prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *