మ‌ళ్లీ త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌లు

Date:23/09/2020

ముంబై ముచ్చట్లు

పసిడి మళ్లీ తగ్గింది. బంగారం ధర వెలవెలబోయింది. బంగారం మరోసారి పడిపోయింది. ఈరోజు కూడా పసిడి ధర దిగొచ్చింది. దీంతో బంగారం ధర వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నట్లు అయ్యింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశంమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో పసిడి పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది.హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.590 దిగొచ్చింది. దీంతో ధర రూ.53,230కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.540 తగ్గింది. దీంతో ధర రూ.48,800కు దిగొచ్చింది.పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.6400 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.60,600కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర క్షీణించింది. బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం క్షీణతతో 1906 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.08 శాతం తగ్గుదలతో 24.48 డాలర్లకు దిగొచ్చింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

 

 హైటెక్ దొంగ‌త‌నం

Tags:Reduced psidi prices again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *