Redzone in Punganur

పుంగనూరులో రెడ్‌జోన్‌

– పారిశుద్ధ్య కార్యక్రమాలు
– అధికారుల పర్యటన

Date:28/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కట్టక్రిందపాళ్యెంలో ఓ వ్యక్తికి కరోనా రావడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గురువారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ కట్టక్రిందపాళ్యెం చుట్టు 200 మీటర్ల ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా విధించారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. ప్రతి ఇంటికి హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేసి శుభ్రం చేశారు. కరోనా బాధితుడి ఇంటి పరిసరాలలో ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ప్రజలకు తలెత్తకుండ వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు. అలాగే రెడ్‌జోన్‌ ప్రాంతాలలో ప్రజలు ఎలాంటి ఆనారోగ్యానికి గురైన తక్షణమే తెలియజేయాలని, ప్రతి ఇంటిని ప్రతి రోజు సందర్శించాలని ఆదేశాలిచ్చారు. అలాగే ప్రజలకు ఎలాంటి మందులు అవసరమైన టెలిమెడిషన్‌ నెంబరు: 14410కి ఫోన్‌ చేసిన వెంటనే మందులు ఉచితంగా ప్రజలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులను డోర్‌ డెలివరి చేసేందుకు పట్టణంలోని 8 షాపులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు, డిప్యూటి తహశీల్దార్‌ మాదవరాజు, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌, కార్మికులు పాల్గొన్నారు.

రెడ్‌జోన్‌ ప్రాంతాలు…

పట్టణంలోని రాంపాలవాండ్లసంధు, నల్లగుండ్లవాండ్ల వీధి, కట్టక్రిందపాళ్యెం, చింతలవీధి, కట్టక్రింద హరిజనవాడ, మకాన్‌సంధు, కోడిపల్లి సుబ్బరాయప్పవీధి, ప్యాలెస్‌కాంపౌండు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు.

29న ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ పర్యటన

Tags: Redzone in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *