సమస్యల పరిష్కారానికి సంస్కరణలు : సీఎం చంద్రబాబు

Reforms to solving problems: CM Chandrababu

Reforms to solving problems: CM Chandrababu

Date:27/02/2018
అమరావతి ముచ్చట్లు:
ఏ స్థాయిలో ఉన్నా మనం ఎక్కడి నుంచి వచ్చాం అని నిత్యం గుర్తుంచుకోవాలి. కష్టాలకు భయపడలేదు, కలిసొచ్చినప్పుడు ఆనందపడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నాడు జరిగిన తెలుగు దేశం సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. సమస్యల పట్ల ఎన్నో సంస్కరణ లు తీసుకొచ్చాం. తాను  నిత్యం విద్యార్థిలా నేర్చుకుంటూ ఉంటేనే ఎందులో అయినా రాణిస్తామని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.. దేశంలో ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉండేది. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టేటప్పుడు మీ సిద్దాంతం ఏమిటని అంతా అడిగారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు వేరే సిద్ధాంతాలు లేవని ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రజలు ఆనందంగా లేకపోతే ఎవరూ మనల్ని గుర్తుపెట్టుకోరన్నారు. టీడీపీకి ముందు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అవకాశాలు వచ్చాయని, కాసుల కోసం కక్కుర్తితో వాటిని దుర్వినియోగం చేసుకున్నారన్నారు.కమిటీ సమావేశం సందర్బంగా  40సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా నేతలు,కార్యకర్తలు చంద్రబాబుకు శుభకాంక్షలు తెలియచేసారు. సమావేశం ముందు అభిమానుల మధ్య 40సంవత్సరాల కేక్  ను అయన  కట్ చేసారు. 40సంవత్సరాల రాజకీయ జీవతం గుర్తుగా 40 పావురాలు  వదిలారు. భేటీలో ప్రముఖ సినీనటి శ్రీదేవి మృతికి సంతాపం తెలిపారు. సమావేశంలో  రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో  మంత్రులు సోమిరెడ్డి, లోకేష్ , యనమల,కాల్వ శ్రీనివాసులు…పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మేల్సీలు  పాల్గోన్నారు.
Tags; Reforms to solving problems: CM Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *