రెజీనా కసాండ్రా, నివేదా థామస్, సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ ,క్రాస్ పిక్చర్స్  ‘శాకిని డాకిని’ సెప్టెంబర్ 16న విడుదల

హైదరాబాద్ ముచ్చట్లు:


‘ఓ బేబీ’ సూపర్ హిట్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శాకిని డాకిని. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. శాకిని డాకిని సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.రిలీజ్ డేట్ పోస్టర్‌లో డేర్‌డెవిల్ లేడీస్ రెజీనా, నివేద సీరియస్ లుక్ ఇంటెన్స్ గా వుంది. టైటిల్ మధ్య అక్షరాలకు పింక్ కలర్ ఇవ్వడం, పోస్టర్ లో ఆ పింక్ లైట్ రెజీనా, నివేదపై పడటం ఆసక్తికరంగా వుంది.మిడ్‌నైట్ రన్నర్స్  గ్లోబల్ అప్పీల్ కలిగి కథ. కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా, విప్లవ్ నైషధం ఎడిటర్ గా పని చేస్తున్నారు.

 

Tags: Regina Cassandra, Niveda Thomas, Suresh Productions, Guru Films, Cross Pictures ‘Shakini Dakini’ releases on September 16

 

Leave A Reply

Your email address will not be published.