Register as voters and exercise their rights

ఓటర్లుగా నమోదై , హక్కులను వినియోగించుకోండి

– తహశీల్ధార్‌ వెంకట్రాయులు

Date:25/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పదెన్నిమిది సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదై, తమ హక్కులను వినియోగించుకోవాలని తహశీల్ధార్‌ వెంకట్రాయులు తెలిపారు. శనివారం పట్టణంలోని ఇందిరా సర్కిల్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహశీల్ధార్‌ వెంకట్రాయులు, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, సీఐ మదుసూదనరెడ్డి, డిప్యూటి తహశీల్ధార్లు మాదవరాజు, రమేష్‌బాబు,ఎస్‌ఐ తిప్పేస్వామితో కలసి మానవహారం పాటించి ప్రతిజ్ఞ చేశారు. అలాగే బసవరాజ కళాశాలలో ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించి , నూతనంగా నమోదైన ఓటర్లకు కార్డులను పంపిణీ చేశారు. సీనియర్‌ సీటీజన్‌ ఓటర్లను సన్మానించారు. ఈ సందర్భంగా తహశీల్ధార్‌ మాట్లాడుతూ రాజ్యాంగం అందించిన హక్కులను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నేటికి ఎంతో మంది తమ ఓటు హక్కును వినియోగించుకోకుండ దుర్వినియోగం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటరుగా నమోదుకు 18 సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరు అర్హులన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యువత ఓటర్లుగా నమోదు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాది వెంకటపతి, బిఎల్‌వోలు, వీఆర్‌వోలు, హెచ్‌ఎం వెంకట్రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం

Tags: Register as voters and exercise their rights

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *