Natyam ad

పుంగనూరులో డిగ్రీ చదివిన వారిని ఓటర్లుగా నమోదు చేయండి-కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

డిగ్రీ చదివిన వారిని ఓటర్లుగా నమోదు చేసే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి సూచించారు. బుధవారం మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా, జానపద కళల సంస్థచైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌, డిప్యూటి తహశీల్ధార్‌ రమేష్‌ కలసి బిఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కావాలన్నారు. ఇందు కోసం పట్టణంలో ఆయా బిఎల్‌వోలచే నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలని సూచించారు. అలాగే సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కూడ నమోదు కార్యక్రమంలో భాగస్వామ్యులుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, నరసింహులు, తుంగామంజునాథ్‌, రేష్మా తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Register degree holders in Punganur as voters-Commissioner Narasimhaprasad Reddy

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.