పుంగనూరులో ఆర్మీ ఉద్యోగాలకు సచివాలయాలలో నమోదు-తహశీల్ధార్‌ వెంకట్రాయులు

పుంగనూరు ముచ్చట్లు:

 

 

ఆర్మీలో ఉద్యోగాల కోసం సచివాలయాలలో నిరుద్యోగులు నమోదు చేసుకోవాలని తహశీల్ధార్‌ వెంకట్రాయులు సూచించారు. సోమవారం ఆయన మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వరి, ఎంఈవో కేశవరెడ్డితో కలసి సమావేశం నిర్వహించారు. పుంగనూరు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఆర్మీ ఉద్యోగాలలో అవకాశాలు కల్పించేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపిక కార్యక్రమాన్ని పుంగనూరులో నిర్వహిస్తున్నారని తెలిపారు. నిరుద్యోగులు సచివాలయాలలో నమోదు చేసుకోవాలన్నారు. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు నిరుద్యోగులు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఉద్యోగాల కోసం నెల రోజుల పాటు తిరుపతిలో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీ ఎంపిపి నరసింహులు, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Registered with the Secretariats for Army Jobs at Punganur-Tahsildhar Venkatrao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *