సబ్సిడీ విత్తనాలు కొరకు పేరు  నమోదు  చేసుకోవాలి దర్శి వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్

దర్శి ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి మండలం లోని రైతు భరోసా కేంద్రాలలో రైతులు కి 50% సబ్సిడీ తో విత్తనాలు అందచేస్తున్నామని ఈ అవకాశం ప్రతి ఒక్క రైతు సోదరులు వినియోగించు కొని లబ్ది పొందాలని  దర్శి మండలం వ్యవసాయ అధికారి వి. బాలకృష్ణ నాయక్ విజ్ఞప్తి చేశారు. ఇందు కోసం ముందుగా రైతు భరోసా కేంద్రంలో పేరు నమోదు చేయించు కోవాలని తెలిపారు. కావలిసిన ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నెంబర్ తెలియ జేసీ రైతు భరోసా కేంద్రం లో  పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 50% సబ్సిడీ పచ్చి రొట్టె  విత్తనాలు అయిన జనుములు 10కేజీలు 375 రూపాయలు, జీలగలు 10కేజీలు 290రూపాయలు, పిల్లి పెసర్లు 8కేజీలు 340 రూపాయలు గా ధర ఉంటుంది అని  మండల వ్యవసాయ అధికారి  బాలకృష్ణ నాయక్  తెలియజేసారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Registration is required for subsidized seeds
Darshi Agriculture Officer Balakrishna Nayak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *