Registration of cases under the Periodic Act against the Sara merchants

సారా వ్యాపారులపై పీడి యాక్ట్ క్రింద కేసులు నమోదు

– 1200 లీటర్ల సారా ఊట ధ్వంసం
– 150 లీటర్ల సారా స్వాధీనం
– ఒకరు అరెస్ట్
– సీఐ శ్రీనివాసరెడ్డి

Date:26/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

అక్రమంగా నాటుసారా తయారు చేసి విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామని ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం శ్రీనివాసరెడ్డి, స్థానిక సీఐ గంగిరెడ్డి, ఎస్‌ఐలు ఉమా మహేశ్వరరావు, తిప్పేస్వామి , సరితారెడ్డితో కలసి సుగాలిమిట్ట, పట్రపల్లెతాండాలలో దాడులు చేశారు. 1200 లీటర్ల సారా ఊటను్య ధ్వంసం చేసి, 150 లీటర్ల సారాతో పాటు నాగమ్మ అనే మహిళను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సెజ్‌ సీఐ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు గిరిజన తాండాలలో అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించి, సారా తయరీ ఆపి వేయాల్సిందిగా కోరడం జరిగిందన్నారు. కానీ కొంత మంది రహస్యంగా పొలాల్లో సారా తయారీ చేస్తున్నారని, వారిపైన పీడీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైన ప్రజలు ప్రభుత్వ విధానాలకు లోబడి జీవనం సాగించాలని కోరారు. ఈ దాడుల్లో డ్రమ్ములు, బెల్లం, తుమ్మచెక్క స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

27న మార్కెట్‌ కమిటి చైర్మన్‌నాగరాజారెడ్డి పదవీ స్వీకారం

Tags; Registration of cases under the Periodic Act against the Sara merchants

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *