Natyam ad

ఓటర్ల నమోదు, మార్పులు , చేర్పులు పకడ్బంధిగా నిర్వహించాలి- సీఈవో ప్రభాకర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు పకడ్భంధిగా చేపట్టాలని జెడ్పి సీఈవో ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్‌లో జరుగుతున్న నమోదు కార్యక్రమాన్ని తహశీల్ధార్‌ సీతారామన్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్‌వోలకు పలు సూచనలు చేశారు. సీఈవో మాట్లాడుతూ ఎన్నికల పక్రియ ఓటర్ల జాబితాలతో ప్రారంభమౌతుందన్నారు. ఇలాంటి విషయంలో ఎవరు అలసత్వం వహించరాదన్నారు. జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ ఆదేశాల మేరకు నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులను గుర్తించి, వారి ఇంటికి వెళ్లి ఓటరుగా నమోదు చేయించాలన్నారు. అలాగే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన వారిని, ఒకరికి రెండు మూడు ప్రాంతాలలో ఓట్లు ఉన్న వారిని గుర్తించడంతో పాటు, చనిపోయిన వారిని తొలగించే కార్యక్రమం పటిష్టంగా చేపట్టాలన్నారు. ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండ చూడాలన్నారు. అధికారులు , బిఎల్‌వోలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సూచించారు.

 

Post Midle

Tags: Registration of voters, changes and additions should be carried out in a strict manner – CEO Prabhakar Reddy

Post Midle