ఇష్టానుసారంగా ఓట్ల నమోదు

Registration of votes at will

Registration of votes at will

Date:13/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్రంలో దాదాపు 30 లక్షల ఓటరు నమోదుకు దరఖాస్తులు వచ్చాయి. అడిషన్  ఓట్లు దాదాపు 22లక్షల వరకు ఉన్నాయి అన్నారు. హై కోర్టును తప్పుదోవ పట్టించేలాగా చెప్పిన అంశాలను మేము తీవ్రంగా తప్పుబడుతున్నామని టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ చెప్పిన అంశాలలో చాలా తప్పులు ఉన్నాయి,ఈ టీఆరెస్ ప్రభుత్వం ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన కేసీఆర్ అప్పుడొక మాట ఇప్పుడొక మాట ప్రభుత్వంతో చెప్పిస్తున్నారని అన్నారు. 2కోట్ల 73లక్షల ఓటర్లు ఉన్నట్టు నివేదిక ఇచ్చారు. ఇంతకు ముందు ఓటరు లిస్టు ప్రకారం దాదాపు 60 లక్షల ఓట్లు వున్నాయి.  ఓటరు నమోదు కార్యక్రమంలో ఇష్టాను సారంగా జరుగుతున్నాయి,వారికి ఇష్టం ఉన్న వారి ఓట్లు ఉంచి ఇష్టం లేని వారి ఓట్లు తీసివేస్తున్నారని విమర్శించారు. ఇంటి ఇంటికి వెళ్లి ఓటరు నమోదు చేయాలి.
కానీ అలా జరగడం లేదు. ఓటరు లిస్ట్ ఫైనల్ లిస్ట్ అర్ధరాత్రి ఎప్పుడో విడుదల చేసారు. ప్రజా స్వామ్యం పదిలంగా లేకపోతే ప్రజా స్వామ్యం అపహాస్యం అవుతుంది. ఫెడరల్ ఫ్రంట్ పెట్టి దేశంలో గుణాత్మక మార్పులు తెస్తా అంటున్న కేసీఆర్,  ఇలా ఓటర్ల నమోదులో అవకతవకలు చేయడమే గుణాత్మక మార్పా అని అడిగారు. దేశ సమగ్రత కోసం యువత జాగృతం కావాలి,ఓటు హక్కు ను వినియోగించుకోవడానికి ఓటు హక్కు నమోదు చేసుకోవాలి.   కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు న్యాయం చేయడానికి పోరాటం చేస్తూనే ఉంది,ప్రజలకు సహాయ పడటంలో ఇంకా ఎలా చేయాలో నిర్ణయం తీసుకుంటాం. పూర్తి ఆధారాలతో మేము పోరాడుతున్నాం. ఓటరు నమోదు పైన జరుగుతున్న అవకతవకలు పైన వేసిన కేసు ఇంకా కోర్టులో సజీవంగా ఉందని అన్నారు.
Tags:Registration of votes at will

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *