2000 సంవత్సరం లోపు రిజిస్ట్రేషన్ వాహనాలకు చెల్లు

Date:16/03/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
భారీ కాలుష్యాన్ని వెదజల్లే పాత వాహనాలను రోడ్లపై తిరుగనీయకుండా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వాయుకాలుష్యాన్ని తగ్గించడం కోసం సరికొత్త ప్రణాళికను అమలు చేయబోతుంది. కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టేందుకు వాణిజ్య వాహనాల జీవిత కాలాన్ని 20ఏళ్లకు పరిమితం చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా2000 సంవత్సరం లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న కమర్షియల్ వెహికిల్స్.. ట్యాక్సీలు, ట్రక్కులు, బస్సులు 2020తరువాత రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉండదు. మరోవైపు వ్యక్తిగత వాహనాలకు ఎలాంటి వయస్సు పరిమితి విధించడం లేదని విశ్వసనీయ వర్గాల సమచారం. ప్రైవేట్ వెహికిల్స్ ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయితే వీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రధానమంత్రి కార్యాలయంలో(పీఎంవో)లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందులో నీతి ఆయోగ్, ట్రాన్స్‌పోర్ట్, హెవీ ఇండస్ట్రీస్, ఆర్థిక, పర్యావరణ మంత్రిత్వశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 2000సంవత్సరం లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న దాదాపు 7లక్షల వాణిజ్య వాహనాలు 2020తరువాత నిషేధానికి గురికానున్నాయని అంచనా వేస్తోంది.
Tags: Registration vehicles under 2000 are valid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *