పుంగనూరులో రెండు నెలల్లో టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్లు- టిడ్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్‌

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలో నిర్మించిన టిడ్కో గృహాల నిర్మాణం పూర్తికాబడిందని , మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని , రెండు నెలల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర టిడ్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన టిడ్కో గృహాలను మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు రెండునెలల్లో పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే జగనన్న పచ్చతోరణం క్రింద ఒకొక్క ఇంటికి నాలుగు మొక్కలు చొప్పున మొత్తం 6 వేల వెహోక్కలను నాటించాలన్నారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రతి ప్రాంతంలోను టౌన్‌షిప్‌లు సిద్దమౌతున్నాయని తెలిపారు. సుమారు 35 లక్షల మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి, పక్కా గృహాలు నిర్మిస్తున్న ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించడం చరిత్ర సృష్టించడమేనని కొనియాడారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.25 వేలు చొప్పున లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన విషయమై లబ్ధిదారులతో చర్చించి, నివేదికలు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌ అలీమ్‌బాషా, టిడ్కో చైర్మన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ మహేష్‌ , టిడ్కో స్థానిక ఇన్‌చార్జ్ రవీన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Registrations of Tidco houses in Punganur in two months – Tidco Chairman Prasanna Kumar

 

Leave A Reply

Your email address will not be published.