Regular corona tests

నిత్యం కరోనా పరీక్షలు

Date:17/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో కారోనా వ్యాధిని నిర్ధారించేందుకు ప్రతి రోజు వార్డుల వారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌ తెలిపారు. శనివారం 4వ వార్డు రహమత్‌ నగర్‌లో ఆయన ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 130 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇంకను అవసరమైన ప్రాంతాలలో పరీక్షలు చేయించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే హ్గం ఐసోలేషన్‌లో ఉండే వారికి అన్ని రకాల మందులను వారి ఇండ్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సాజిదా, ఫరీదా, సుజాత , ఏఎన్‌ఎం వనజ, ఆశావర్కర్‌ ప్రమీల పాల్గొన్నారు.

రైతులు ఉలవ పంటలు పండించేందుకు సిద్దంకండి

Tags: Regular corona tests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *