నాయిని వ్యాఖ్యలపై ఈసికి రేవంత్‌రెడ్డి పిర్యాదు 

Reiki's complaint against Nai's comments

Reiki's complaint against Nai's comments

– తెరాస సర్కార్‌ నుంచి తనకు ప్రాణహాని ఉంది
– కేంద్ర భద్రతా సంస్థల ద్వారా రక్షణ కల్పించాలి
Date:13/10/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
తెరాస అధినేత, సీఎం కేసీఆర్ తనకు రూ.10 కోట్లు ఇస్తానన్నారంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌, సంయుక్త ఎన్నికల ప్రధానాధికారి ఆమ్రపాలిని కలిసి పిర్యాదు చేసారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాయిని వ్యాఖ్యల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేయాలని.. లేదంటే తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరానన్నారు. నాయిని స్టేట్‌మెంట్ రికార్డు చేసి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.డీజీపీ మహేందర్ రెడ్డి గతంలో నాగార్జునసాగర్‌లో జరిగిన తెరాస నేతల శిక్షణకు హాజరైనందున ఆయనపై తనకు నమ్మకం లేదని.. కేంద్ర సంస్థల సిబ్బందితో తనకు భద్రత కల్పించాలని కోరినట్లు రేవంత్‌ చెప్పారు. ఇటీవల మంత్రి జగదీశ్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌ తనను భౌతికంగా అంతమొందిస్తామని హెచ్చరించారని.. తెరాస సర్కార్‌ నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు ఫిర్యాదు చేశానన్నారు. తనకు కేంద్ర భద్రతా సంస్థల ద్వారా రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘం అధికారులను కోరినట్లు రేవంత్‌ వివరించారు.
Tags:Reiki’s complaint against Nai’s comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *