వివేకానందతో అనుబందం

Relationship with Vivekananda

Relationship with Vivekananda

Date:15/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ప్రజలకు, పట్టణానికి వైఎస్‌. వివేకానందరెడ్డితో ఎంతోఅనుబంధం ఉంది. 1999 ఉప ఎన్నికల్లో వైఎస్‌.వివేకానందరెడ్డి పుంగనూరుకు వస్తుండగా పెద్దపంజాణి పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లి ఆపివేశారు. ఈ సందర్భంగా అప్పటి కాంగ్రెస్‌ నాయకులు మారిశెట్టి, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్‌, రాయలజగదీష్‌ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. ప్రస్తుతం పుంగనూరు వైఎస్సార్‌సీపీ బూత్‌కమిటి మేనేజర్‌ అమ్ము, నియోజకవర్గ బూత్‌ కమిటి మేనేజర్‌ రెడ్డెప్ప , యాదవ సంఘ నాయకులు సుబ్బన్నయాదవ్‌ తరచుగా వివేకానందరెడ్డిని కలిసేవారు. వీరితో పాటు చౌడేపల్లెకు చెందిన పార్టీ నాయకులు మిద్దింటి శంకర్‌నారాయణ, ఆయన తనయుడు మిద్దింటి కిషోర్‌లకు వివేకానందతో అనుబంధాలు ఉన్నాయి. ఆయన మృతి పట్ల వీరంత సంతాపం తెలిపారు.

వివేకానందరెడ్డి మృతి తీరని లోటు

Tags: Relationship with Vivekananda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *