ఖైదీ మృతిపై బంధువుల అందోళన
నిర్మల్ ముచ్చట్లు:
జిల్లా కేంద్రంలోని సబ్ జైలులో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీ సతీష్ మృతి చెందాడు. అనారోగ్యంగా ఉండటంతో సతీష్(26) ను జైలు సిబ్బంది జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగానే సతీష్ మృతి చెందినట్లు జైలు సిబ్బంది వివరణ ఇచ్చారు. సతీష్ అనారోగ్య విషయాన్ని బంధువులకు జైలు సిబ్బంది తెలిపారు. సతీష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని బంధువులు అంటున్నారు. మృతుడు సతీష్ లక్ష్మణ చందా మండలం టీచర్ గ్రామానికి చెందినవాడు. మృతుడికి ఒక భార్య ఒక బాబు ఉన్నారు . సతీష్ మృతితోకుటుంబం రోడ్డున పడింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సతీష్ బంధువులు రాస్తారోకో కు దిగారు. మృతికి గల కారణాలను బయటపెట్టి బాధితులను శిక్షించాలని డిమాండ్ చేసారు. సతీష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసారు.
Tags: Relatives of the prisoner’s death

