Natyam ad

అంధురాలిపై దాడి చేసిన బంధువులు

అనంతపురం ముచ్చట్లు:

అంధురాలైన పెద్దక్క అనే మహిళను తోటలోకి తీసుకెళ్లి రాళ్లతో దాడిచేసి గాయపరిచిన సంఘటన అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల నేపథ్యంలో ఈ దాడి జరిగిందా? దాడి చేసినవారు ఆత్మీయులేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దాడిలో గాయపడిన పెద్దక్కను గ్రామస్థులు ఓ ప్రైవేటు వాహనంలో తొలుత తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి అనంతపురం తరలించారు. సోదరుడి కుటుంబ సభ్యులే దాడిచేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. పెద్దక్కను ఆమె సోదరుడి భార్య తోటవద్దకు తీసుకెళ్లిందని గ్రామస్థులు చర్చించుకుం టున్నారు. దీనిపై ఎస్ఐ ఖాజాహుస్సేన్ మాట్లాడుతూ. పెద్దక్కతో సోదరుడు, అతడి భార్య ఆస్తి కోసం గొడవపడినట్లు తెలిసిందని అన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

Tags: Relatives who attacked Andhurali

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.