-ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు ఇంటర్ మార్కులను పరిగణించరు
*జేఈఈ మెయిన్ ఆధారంగానే అడ్మిషన్లు
*ప్రశ్నపత్రంలో విద్యార్థులకు ఆప్షన్ల్లు
Date:20/01/2021
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఎన్ఐటీలు, కేంద్ర నిధులతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటర్లో 75 శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధనను సడలించింది. వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) సంబంధించి ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, ఎస్పీఏలో ప్రవేశాలకు ఇంటర్లో 75 శాతం మార్కులు తప్పనిసరి అన్న నిబంధనను తొలగిస్తున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. దీని ప్రకారం.. జేఈఈ మెయిన్ ఫలితాల ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
జేఈఈ, నీట్ సిలబస్లో మార్పులేదు.
జేఈఈ, నీట్-2021 సిలబస్లో ఎలాంటి మార్పు లేదు. అయితే పరీక్షా విధానంలో మాత్రం మార్పులు ఉండనున్నాయి. గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. దీని ప్రకారం జేఈఈ మెయిన్-2021లో భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం నుంచి 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. మూడు సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 75 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
Tags: Relaxation of 75% marks in Inter