Relaxation of sanctions on international travelers

అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షల సడలింపు

-ఓసీఐ కార్డుదారులు రావొచ్చు

-విదేశీయులకూ అనుమతి

-పర్యాటక వీసాలపై కొనసాగనున్న నిషేధం

-కేంద్రం ఉత్తర్వులు జారీ

Date:23/10/2020

దిల్లీ ముచ్చట్లు:

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఇప్పటివరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇక మీదట వాటిని దశలవారీగా తొలగించాలని నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు జారీచేసే వీసాలు, భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లాలనుకొనే వారిపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను సడలించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఓవర్‌సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ), పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ (పీఐఓ) కార్డులున్న వారు భారత్‌కు రావాలనుకుంటే రావొచ్చని పేర్కొంది. పర్యాటక వీసాలు మినహాయించి మిగిలిన వీసాలున్నవారెవరైనా వాయు, జల మార్గంలో భారత్‌కు వస్తే అనుమతించాలని అక్కడి ఇమిగ్రేషన్‌ చెక్‌పోస్టులకు ఆదేశాలు జారీ చేసినట్లు హోంశాఖ పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతించిన వందేభారత్‌ మిషన్‌, ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్‌ బబుల్‌, నాన్‌ షెడ్యూల్డ్‌ వాణిజ్య విమానాల ద్వారా రాకపోకలు సాగించవచ్చని పేర్కొంది. అయితే ప్రయాణికులంతా కేంద్ర వైద్యఆరోగ్యశాఖ జారీచేసిన ఆదేశాలమేరకు క్వారంటైన్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ సడలింపుల్లో భాగంగా ప్రస్తుతం అన్ని రకాల వీసాల (ఎలక్ట్రానిక్‌ వీసా, టూరిస్ట్‌ వీసా, మెడికల్‌ వీసాలు మినహాయించి)ను తక్షణం పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు హోంశాఖ వెల్లడించింది. ఒకవేళ వీసాల కాలపరిమితి ముగిసి ఉంటే సంబంధిత ఇండియన్‌ మిషన్‌/పోస్ట్‌ల నుంచి తాజా వీసాలు పొందొచ్చని సూచించింది. ఎవరైనా విదేశీయులు వైద్యం నిమిత్తం భారత్‌కు రావాలనుకుంటే మెడికల్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికైతే విదేశీయులు వ్యాపారాలు, సమావేశాలు, ఉద్యోగాలు, చదువులు, పరిశోధనలు, వైద్య సౌకర్యాల కోసం భారత్‌కు రావడానికి వీలవుతుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

అనంతపురం కలెక్టరేట్ లో కలెక్టర్ గంధం చంద్రుడు ప్రెస్ కాన్ఫరెన్స్

Tags: Relaxation of sanctions on international travelers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *