చేసిన ప్రతి సినిమా విడుదల కావాలి…

– ప్రతాని రామకృష్ణ గౌడ్
Date:14/07/2018
హైదరాబాద్‌ముచ్చట్లు:
విడులకు నోచుకోని సినిమా అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండకూడదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ అన్నారు. థియేటర్ లో విడుదల కావడం అనేది నిర్మాణం జరిగిన ప్రతి సినిమా హక్కు అని ఆయన చెప్పారు. పరిశ్రమలో వెయ్యికి పైగా చిత్రాలు విడుదల కాకుండా ఉన్నాయని ఆయన అన్నారు.  ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇటీవలే గౌరవ డాక్టరేట్ పొందిన ప్రతాని రామకృష్ణ గౌడ్ సన్మాన కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరర్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ ఛైర్మన్ లింగపల్లి కిషన్ రావు, తెలంగాణ స్పోర్ట్ అథారటీ  ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా రామకృష్ణ గౌడ్ కు సన్మానం జరిగింది. అనంతరం ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…రాజకీయాలా, సినిమా అనే సందర్భం వచ్చినప్పుడు నేను సినిమానే ఎంచుకున్నాను. ఎందుకంటే సినిమా మీద నాకున్న ప్రేమ అలాంటిది. ఇక్కడికి వచ్చి చూశాక చాలా సమస్యలు ఉన్నాయనిపించింది. పరిశ్రమలో కొందరి ఆధిపత్యం సాగుతోంది. చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతోంది. ముఖ్యంగా చిత్రాల విడుదల సమయంలో చిన్న నిర్మాత ఇబ్బందులు పడుతున్నారు. టాలీవుడ్ లో సుమారు వెయ్యి చిత్రాలు విడులకు నోచుకోకుండా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలో ఒక యాప్ ను విడుదల చేయబోతున్నాం. దీని ద్వారా సినిమాలు ప్రదర్శించి నిర్మాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తాం. ఇకపై విడుదల కాని సినిమా ఉండకూడదు. భవిష్యత్ లో సినిమాల విడులకు థియేటర్ కంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు వస్తాయని ఆశిస్తున్నాం. డాక్టరేట్ రావడం ఒక గౌరవం. అయితే దీంతోనే ఏదో సాధించినట్లు భావించడం లేదు. ఇంకా మరింత ఉత్సాహంతో పరిశ్రమకు సేవ చేయాలని అనుకుంటున్నాను. అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్ సీసీ సెక్రటరీ సాయి వెంకట్, ఉపాధ్యక్షుడు మోహన్ గౌడ్, తెలంగాణ నటీనటుల సంఘం జాయింట్ సెక్రటరీ లత, షీ టీమ్స్ హైదరాబాద్ ఇన్ ఛార్జ్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
చేసిన ప్రతి సినిమా విడుదల కావాలి…https://www.telugumuchatlu.com/release-every-movie-made/
Tags; Release every movie made …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *