అమరవీరుల స్మృతి వనం కి అభివృద్ధి జీవో విడుదల

ఇంద్రవెల్లిముచ్చట్లు:

భూమి కోసం విముక్తి కోసం దోపడికి వ్యతిరేకంగా తిరగబడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్ధం ఆదిలాబాద్ జిల్లా.. ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన స్థూపం వద్ద స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలన్నది అక్కడి గిరిజనుల చిరకాల స్వప్నం. ఎట్టకేలకు ఆ కల నెరవేరే క్షణాలు ఆసన్నమయ్యాయి.
ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇంద్రవెల్లిని సందర్శించి స్థూపం వద్ద గ్రామ సభ ఏర్పాటు చేసి గిరిజన పెద్దలతో సంప్రదింపులు జరిపారు.  ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి అమరులకు నివాళులు అర్పించి అనంతరం అక్కడే గిరిజన పెద్దలు, అధికారులతో స్మృతి వనం ఏర్పాటు గురించి చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా.. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా.. కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ స్మృతి వనం ఏర్పాటు విషయమై గిరిజన పెద్దలతో సంప్రదింపులు జరిపారు.  స్మృతి వనం ఏర్పాటు అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపేందుకు నివేదికను కూడా సిద్దం చేశారు…

 

Tags: Release of developmental bio to memory forest of Martyrs

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *