Release of notification for DMRL JRF replacement

డీఎంఆర్ఎల్‌ జేఆర్ఎఫ్‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల

Date:21/11/2020

హైద‌రాబాద్‌ ముచ్చట్లు:

న‌గ‌రంలోని డీఆర్‌డీఓ.. డిఫెన్స్ మెట‌ల‌ర్జిక‌ల్ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (డీఎంఆర్ఎల్‌)లో ఖాళీగా ఉన్న జేఆర్ఎఫ్‌, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఆస‌క్తి క‌లిగి అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 2 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ఎలాంటి రాత‌ప‌రీక్ష లేద‌ని, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. మొత్తం పోస్టులు: 21.ఇందులో జేఆర్ఎఫ్- 18 (మెట‌ల‌ర్జిక‌ల్ లేదా మెటీరియ‌ల్ సైన్స్‌-13, ఫిజిక్స్‌-1, కెమిస్ట్రీ-1, మెకానిక‌ల్‌-3), రిసెర్చ్ అసోసియేట్-3  (మెట‌ల‌ర్జిక‌ల్ లేదా మెటీరియ‌ల్ సైన్స్‌-1, ఫిజిక్స్‌-1, కెమిస్ట్రీ-1)
అర్హ‌త‌: జేఆర్ఎఫ్‌ల‌కు సంబంధిత స‌బ్జెక్టులో పీజీ చేసిఉండాలి. మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ఉత్తీర్ణులై,  28 ఏండ్ల‌లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల‌కు సంబంధిత స‌బ్జెక్టులో ఎమ్మెస్సీ, ఎంటెక్ చేసి, 35 ఏండ్ల లోపు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. అధికారిక వెబ్‌సైట్‌లో నిర్ణీత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను డౌన్‌లోడ్‌చేసుకుని, దానిని పూర్తిగానింపి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి ఈ-మెయిల్ చేయాలి.ఎంపిక ప్ర‌క్రియ‌: ఇంట‌ర్వ్యూ ద్వారా ‌.ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: నం,బ‌ర్ 21,ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: 2021 జ‌న‌వ‌రి 2

 

వివాహ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

Tags:Release of notification for DMRL JRF replacement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *