ఆలయాల ధర్మకర్తల మండలి నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

Date:15/11/2019

చిత్తూరు ముచ్చట్లు:

జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పలు ఆలయాల ధర్మకర్తల మండలి నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఉత్తర్వులు జిల్లా దేవాదాయ శాఖ అధికారులకు అందాయి. ఇందులో భాగంగానే సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయం, నగిరి దేశమ్మ దేవత ఆలయం, ఎర్ర వారి పాలెం తలకోన సిద్దేశ్వర ఆలయం, కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి ఆలయాలకు సంబంధించి ట్రస్ట్ బోర్డు నియామకాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవులు ఆశిస్తున్న ఆశావహులు మరో 20 రోజుల లోపు దరఖాస్తులను ఆయా దేవాదాయ శాఖ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.

 

నవధాన్యాల అలంకరణతో శ్రీ విరుపాక్షి మారెమ్మ దర్శనం

 

Tags:Release of Notification to Appointments of Temple Trustees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *