సీజ్ చేసిన వాహానాలు రిలీజ్

Date:23/05/2020

విజయవాడ ముచ్చట్లు:

రాష్ట్రవ్యాప్తంగా యజమానులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను పీఎస్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.ఏపీ ప్రజలకు పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లొచ్చని తెలిపారు. వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు. యజమానులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను పీఎస్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏపీ పోలీస్ అధికారిక ట్విట్టర్‌లో కూడా సమాచారం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లాలని చెప్పారు.లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఆ వాహనాలను సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. కొన్ని వాహనాలకు జరిమానాలు విధించారు. ఇప్పుడు లాక్‌డౌన్ సడలించడంతో ఆ వెహికల్స్‌ను తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించారు. అయితే ఆ వాహనాలపై ఉన్న చలానాలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇటు తెలంగాణలో కూడా సీజ్ చేసిన వాహనాలను తిరిగి తీసుకెళ్లాలని పోలీసులు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కూడా క్లారిటీ ఇచ్చారు.

జగన్ లాంటి సీఎం ఎవరు లేరు

Tags: Release of Sieged Vehicles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *