వంద రోజుల మహిళా మార్చ్‌ బ్రోచర్‌’ను విడుదల

Date:30/11/2020

అమరావతి ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ‘వంద రోజుల మహిళా మార్చ్‌ బ్రోచర్‌’ను విడుదల చేశారు. ‘నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, దశలవారీ మద్యపాన నిషేధం,దిశ యాప్‌, ఇతర చట్టాలు, హెల్ప్‌లైన్‌ నంబర్లపై …మార్చి 8 వరకు వందరోజుల కార్యాచరణ’ నిర్వహించనున్నారు. వంద రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజీ విద్యార్ధినులకురక్షణ టీంలు, సైబర్‌ నేరాలపై మహిళా కమిషన్‌ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్,ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్‌ పర్సన్‌ ఆర్కే రోజా,  వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌ సుయజ్‌ పాల్గొన్నారు.

ధర్మపురి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

Tags: Release of the Hundred Days Women’s March Brochure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *