Release of Voter Count List in Municipality

మున్సిపాలిటిలో ఓటర్ల గణన జాబితా విడుదల

Date:21/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలో 31 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన కార్యక్రమం పూర్తి కాబడిందని , ఈ మేరకు జాబితాను విడుదల చేస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో జాబితాను విడుదల చేసి మాట్లాడుతూ ఎలెక్షన్‌ కమీషన్‌ ఆదేశాల మేరకు ఈజాబితాపై ఎలాంటి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఉన్నా ఈనెల 23లోపు రాతమూలకంగా ఫిర్యాదు చేయాలన్నారు. అంభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన కార్యక్రమాన్ని 24, 25 తేదీలలో నిర్వహించి, 27న తుదిజాబితా విడుదల చేస్తామన్నారు. మున్సిపాలిటి పరిధిలో ఇప్పటి వరకు 40,720 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అందులో మహిళలు 20,840 మంది , పురుషులు 19,878 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో బీసీ ఓటర్లు 23,814 మంది ఉన్నారని తెలిపారు. అలాగే ఎస్సీ ఓటర్లు 3,263 మంది ఉన్నారని తెలిపారు. ఎస్టీ ఓటర్లు 416 మంది మాత్రం ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, ఆర్‌వో రామకృష్ణ పాల్గొన్నారు.

పాఠశాలల్లో పారిశుద్ధ్య మాసోత్సవాలలో పుంగనూరుకు మొదటిస్థానం

Tags: Release of Voter Count List in Municipality

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *