జూరాల ప్రాజెక్ట్ కాలువల నుంచి నీరు విడుదల

Release of water from project zoos project

Release of water from project zoos project

Date:31/12/2018
గద్వాల జోగులాంబ ముచ్చట్లు:
జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ,  ఎడమ కాలువ క్రింద ఖరీఫ్ -2018 పంటకు లక్ష ఎకరాలకు నీరు విడుదల చేసారు. ఇరవై వేల ఎకరాలకు స్టాండింగ్ క్రాప్ నకు ఇవ్వాల్టి వరకు నీటిని విడుదల చేయుటకు నిశ్చయించామని జిల్లా కలెక్టర్ కే శశాంక్ సోమవారం తెలిపారు. నారాయణపూర్ ప్రాజెక్ట్ కర్ణాటక అధికారులు తెలియజేసిన ప్రకారం రబీ 2018-19 రబీ పంటకు విరామం ప్రకటించారు. జూరాల ప్రాజెక్ట్ లో ఉన్న నికర జలాలను ప్రభుత్వ ఆదేశానుసారం మిషన్ భగీరథ ,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా త్రాగునీటి అవసరములకు జులై -2019 వరకు వినియోగించాలని అయన సూచించారు. జూరాల ప్రాజెక్ట్ లో నీటి లభ్యత తక్కువ ఉన్నందున రబీ -2018-19 పంటకు సాగునీరు అందించే అవకాశం లేదు. నెట్టెంపాడు, ఇతర ఎత్తిపోతల పథకాలకు నీటి లభ్యత లేనందున సాగునీరు అందించలేం. దీనికి రైతులందరు సహకరించవలసిందిగా అయన కోరారు.
Tags:Release of water from project zoos project

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed