పుంగనూరులో పది పరీక్షలపై ఫేక్ కాల్స్ చేసిన టీచర్ అరెస్ట్-బెయిల్ ఫై విడుదల
పుంగనూరు ముచ్చట్లు:
పదవ తరగతి పరీక్షల్లో మాస్ కాపీంగ్ జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తూ ఇన్వీజిలేటర్లపైన లెక్కలేనన్ని ఫేక్ కాల్స్ అధికారులకు చేసిన ప్రభుత్వ టీచర్ కాళివరప్రసాద్ను గురువారం పుంగనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం జరిగిన పదవ తరగతి పరీక్షల్లో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో ఇన్వీజిలేటర్లు బుక్కులు పెట్టి కాపీ కొట్టిస్తున్నారని డీఈవోకు అనేక కాల్స్ వెళ్లాయి. దీనిపై డీఈవో పురుషోత్తం పక్కా విచారణ చేపట్టారు. విచారణలో అవాస్తవమని తేలడంతో డీఈవో ఆదేశాల మేరకు పుంగనూరు పోలీసులకు ఎంఈవో కేశవరెడ్డి ఈనెల 7న ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో అన్నమయ్యజిల్లా మొలకల చెరువు మండలం జెడ్పి హైస్కూల్ టీచర్ కాళివరప్రసాద్ ఫేక్ కాల్స్ చేసినట్లు రుజువు కావడంతో ఆయన ను ఎస్ఐ మోహన్‌కుమార్ అరెస్ట్ చేసి, సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. కోర్టు బెయిల్ మంజూరు చేయగా విడుదలైయ్యారు. కాగా ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ఉంటు ప్రభుత్వ ప్రతిష్టతకు భంగం కలిగించేలా ఉపాధ్యాయులపై అసత్య ఆరోపణలు చేసినందుకు ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఆయనపై చట్టపరమైన చర్యలకు సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.
Tags: Release on arrest-bail of teacher who made fake calls on ten exams in Punganur