Natyam ad

ఓటీపీ ఛీటింగ్ కేసులో భాదితుడికి ఊరట

-చేజారిన నగదులకు తిరిగి ఇప్పించిన పోలీసులు

మచిలీపట్నం ముచ్చట్లు:

ఓటిపి ఫ్రాడ్ ద్వారా మోసపోయిన బాధితునికి కృష్ణాజిల్లా పోలీసులు  నగదును నష్టపోకుండా తిరిగి డిపాజిట్ చేయించారు. బ్యాంక్ కార్యకలాపాల పట్ల అప్రమత్తత లేకుంటే నష్టం తప్పదని  జిల్లా ఎస్పీ హెచ్చరించారు. .నానాటికి పెరుగుతున్న సైబర్ నేరాల బారినపడి ఎంతోమంది అమాయక ప్రజలు బలవుతున్నారు. కేవలం నిరక్షరాస్యులు మాత్రమే నష్టపోతున్నారు అనడానికి లేకుండా, విద్యావంతులు సైతం బ్యాంక్ ఎకౌంట్ అప్డేట్ అనగానే వెనుకా, ముందు ఆలోచించకుండా వారు అడిగిన సమాచారం ఇచ్చేస్తున్నారు. బ్యాంకు వారెప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని అడగరని బ్యాంకు లావాదేవీల విషయంలో అప్రమత్తత లేకుంటే భారీ నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా ఎస్పీ  జాషువా  హెచ్చరించారు. ఇందులో భాగంగా తోట్లవల్లూరు మండలం గరికపర్రుకు చెందిన ఒక వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న 5,13,985/- నగదును సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు తోట్లవల్లురు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా, ఆఫిర్యాదును ఎస్పీ గారి ఆదేశాల మేరకు  మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సైబర్ సెల్ కు బదిలీ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శివాజీ,  ఎస్సై పూర్ణ మాధురి సిబ్బందితో కలిసి దర్యాప్తు చేసి బ్యాంకు అధికారులను సంప్రదించి నగదు సైబర్ నెరగాళ్ళ ఖాతాలోనికి వెళ్లిన మొత్తంలో 2,67,996/- రూపాయలు తిరిగి బాధితుని ఖాతాలో డిపాజిట్ చేయించారు.

 

 

Post Midle

కేసు వివరాల్లోకి వెళితే తోట్లవల్లూరు మండలం గరికపర్రు గ్రామానికి చెందిన సూరపనేని సుధాకర్ అనే వ్యక్తి తన కుమార్తె చదువు నిమిత్తం హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆన్లైన్ యాప్ ద్వారా 45 లక్షల రూపాయలు రుణం పొందగా, తనకున్న ఎస్బిఐ అకౌంట్ నందు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పగా ఇంటికి తిరిగి వచ్చేసాడు. తదుపరి హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళ నుండి మెయిల్ కు ఎస్ఎంఎస్ రాగా, అది బ్యాంకు వారే పంపించారని అనుకొని కేవైసీ  నిమిత్తం పాన్ కార్డ్ అప్లోడ్ చేయకుంటే ఎస్బిఐ అకౌంట్ నెంబర్ బ్లాక్ అవుతుందని వివరాలు ఈ లింక్ ద్వారా నిక్షిప్తపరచమని ఒక లింకును పంపించారు.
ఆ లింకును క్లిక్ చేసి అడిగిన వివరాలు నమోదు చేసిన వెంటనే ఓటిపి రాగా ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే నాలుగుసార్లు దఫా దఫాలుగా మొత్తం 5,13,985/- రూపాయలు విత్ డ్రా అవ్వగా ఎస్బిఐ కస్టమర్ కేర్ నుండి ఎందుకు విత్ డ్రా చేస్తున్నారని కాల్ వచ్చిన వెంటనే బ్యాంకువారు సుధాకర్ సలహా మేరకు ఎకౌంటు బ్లాక్ చేయడం జరిగింది.

 

 

 

వెంటనే జరిగిన నేరం గూర్చి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసిన వెంటనే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆఫిర్యాదును జిల్లా పోలీస్ కార్యాలయంలోని సైబర్ సెల్ కు బదిలీ చేసారు. సైబర్ సెల్ సిబ్బంది వెంటనే దర్యాప్తు జరిపి బ్యాంకు వారిని సంప్రదించి అతని ఖాతా నుండి బదిలీ అయిన మొత్తం నగదు లోంచి 2,67,996/- రూపాయలను అతని బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అయ్యేలా చేయడం జరిగింది. బ్యాంకు ఖాతాల నిర్వహణలో ఖాతాదారులు అప్రమత్తం గా ఉండాలని, ఏదైనా సైబర్ నేరాల బారిన పడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసువారికి ఫిర్యాదు చేయాలని, తద్వారా సైబర్ నేరగాళ్ల ఆట కట్టించవచ్చని ఎస్పీ తెలిపారు.

 

Tags: Relief for accused in OTP cheating case

Post Midle